FbTelugu

ఆనందయ్య కంటి మందులో దుష్ప్రభావాలు లేవు

అమరావతి: ఆనందయ్య కంటి చుక్కల మందుపై ఆయుర్వేద నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది. కంటి చుక్కల వల్ల దుష్ప్రభావాలు ఎక్కడా కనిపించలేదని నిపుణుల కమిటీ తేల్చేసింది.

సాధారణంగా కళ్లల్లో వేసే మందు ప్రమాణాలు ఆనందయ్య చుక్కల్లో లేవని కమిటీ తేల్చింది. స్టెరైల్ టెస్ట్ రిపోర్టు వచ్చాక వినియోగించాలా, వద్దా అన్నది నిర్ధారిస్తామని పేర్కొంది. మందు తయారీ, నిల్వ విధానాల్లో ఈ ప్రమాణాలు పాటించాల్సి ఉందంటున్నారు. కళ్లల్లో వేసే మందుకు రంగు ఉండకూడదు కానీ కంటి చుక్కల మందులో కొంత రంగు ఉంది. 8 రకాల పరీక్షలు చేయగా ఇబ్బందులు ఏమీ గుర్తించలేదని, నిల్వ, తయారీ విధానాల్లో మార్పులు చేయాలి నిపుణులు సూచించారు. నిల్వ కూడా గాజుపాత్రలు లేదా మందులు నిల్వ చేసే దానిలో ఉంచాలని పేర్కొన్నారు. క్లోజ్డు ఏరియాల్లో ల్యాబ్ తరహాలో తయారు చేయాలి. నిర్దేశిత ప్రమాణాల్లో తయారు చేశాక మాత్రమే స్టెరైల్ టెస్టు చేయగలమని ఆయుర్వేద నివేదిక కమిటీ స్పష్టం చేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.