FbTelugu

ఆనందయ్య మందుపై గురువారం నుంచి విచారణ

అమరావతి: నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీపై ఏపి హైకోర్టు విచారణకు అనుమతించింది. హైకోర్టు డివిజన్ బెంచ్ గురువారం నుంచి విచారణ చేపట్టనున్నది.
మందు పంపిణీ ఖర్చును ప్రభుత్వమే భరించాలని, శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా చూడాలని పిటిషనర్లు కోరారు. ఏపి లోకాయుక్త ఆదేశంతో పంపిణీ నిలిపివేసినట్లు పోలీసులు చెబుతున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఆయుర్వేద మందు పంపిణీ అడ్డుకునే అధికారం లోకాయుక్తకు లేదని తెలపగా, పిటిషనర్ల వాదనలు విన్న హైకోర్టు విచారణకు అనుమతి ఇచ్చింది.
15 నిమిషాల్లో లేచి కూర్చున్న యువకుడు…

ఆనంద‌య్య నాటు మందు దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశం అయిన విష‌యం తెలిసిందే. కృష్ణపట్నంలో ఇవాళ మందు తయారు చేసే ప్రాంతాన్ని టీడీపీ ప్రతినిధి బృందం సందర్శించింది. ఈ సంద‌ర్భంగా.. తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లికి చెందిన యువకుడు విషమ పరిస్థితుల్లో అక్కడికి వచ్చాడు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బృందం అక్కడ ఉండగానే అతడి కంటిలో ఆనందయ్య కుటుంబ సభ్యులు మందు చుక్కలు వేశారు. అంతే 15 నిమిషాల్లో లేచి కూర్చోవడంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. కోలుకున్న తరువాత యువకుడు ఆనందయ్యతో పాటు అందరికి ధన్యవాదాలు తెలిపాడు.

You might also like

Leave A Reply

Your email address will not be published.