FbTelugu

500 మందిపై ఆనందయ్య మందు ప్రయోగం: టిటిడి

తిరుమల: కృష్ణపట్నం ఆనందయ్య తయారు చేసిన ఆయుర్వేద మందుపై ప్రజల్లో విశేష స్పందన ఉందని టిటిడి ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి తెలిపారు. ఆనందయ్య మందుపై టిటిడి ఆయుర్వేద నిపుణుల ఆధ్వర్యంలో పరిశోధనలు జరుగుతున్నాయన్నారు.

క్లినికల్ ట్రయల్స్ విషయంపై కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆయుష్ మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకోనున్నదని సుబ్బారెడ్డి అన్నారు. మందును టిటిడి ఆయుర్వేద కాలేజీలో తయారు చేసి క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తామన్నారు. 500 మందిపై నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని, నివేదిక రావడానికి కనీసం వారం రోజుల సమయం తీసుకుంటుందని వివరించారు. దీనికి సంబంధించిన నివేదికను కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి పంపించామన్నారు. టిటిడి తరఫున మందును ప్రజలకు అందించాలని సిఎం ఆదేశిస్తే అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రతిపక్షాలు ఈ అంశంపై లేనిపోని విమర్శలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ప్రజల మేలు కోసం ఈ మందును నిర్థారిస్తే, రాష్ట్ర ప్రభుత్వం ఈ మందును ఉచితంగా అందచేస్తుందని సుబ్బారెడ్డి తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.