FbTelugu

నీ బట్టతల మొగుడికి అంత సీన్ లేదు…

ముంబై: బాలీవుడ్ నటీమణి సోనమ్ కపూర్ పై ఒక అమెరికన్ ఘాటుగా, హాట్ గా విమర్శలు చేసింది. దీంతో సోనమ్ కపూర్ కు కోపం వచ్చి ఊగిపోయింది. తనను తిట్టకుండా, భర్తను టార్గెట్ చేసుకుని తిట్టడాన్ని ఏమాత్రం భరించలేకపోతున్నది.

ఇన్ స్టాగ్రామ్ లో ఒక అమెరికన్ సోనమ్ భర్తను ఉద్దేశించి… నీ భర్త హాట్ గా ఉన్నాడని అనుకుంటున్నావా, అంత సీన్ లేదని స్టేట్ మెంట్ ఇచ్చింది. అంతటితో ఆగకుండా ఒక్కసారి కళ్లు తెరిచి చూడు, ఎంత దరిద్రంగా బట్టతలతో ఉన్నాడో అంటూ చురక అంటించింది. ఈ కామెంట్లను చూసిన సోనమ్ కు చిర్రెత్తుకొచ్చింది. తనను అంటే పర్వాలేదు కాని మధ్యలో తన భర్త ఏం పాపం చేశాడంటూ భగ్గుమంటున్నది.

ఇలాంటి పోస్టుల వల్ల మీకు అభిమానులు పెరుగుతారు, నా నుంచి ఆశించింది ఇదే కదా అంటూ సున్నితంగా మందలించింది. కేవలం తారల దృష్టి ఆకర్షించేందుకే ఇలాంటి చీప్ కామెంట్లు అంటూ సోనమ్ మెస్సేజ్ పెట్టింది. పెళ్లి చేసుకున్న తరువాత సోనమ్ భర్తతో కలిసి లండన్ లో ఉంటున్నది.

You might also like

Leave A Reply

Your email address will not be published.