FbTelugu

చిరుత కోసం కొనసాగుతున్న గాలింపు

హైదరాబాద్: నిన్న నగరంలోని కాటేదాన్ ప్రాంతంలో ఓ చిరుత రోడ్లపైనే సంచరించి ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురిచేసింది. దీంతో రంగంలోకి దిగిన ఫారెస్ట్ ఆఫీసర్లు ఆ చిరుతను పట్టుకోవడానికి నిన్నటి నుంచి గాలింపు కొనసాగిస్తూనే ఉన్నారు.

అయినప్పటికీ చిరుత ఆచూకీ తెలియలేదు. ఇందుకోసం ఫారెస్టు అధికారులు 4 సార్లు డ్రోన్ కెమెరాలతో గాలింపు జరిపారు. 20 ట్రాప్ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. రెండు డాగ్ స్క్వాడ్ ను కూడా రంగంలోకి దింపినట్టు తెలిపారు. ఇంతవరకూ చిరుత ఆచూకీ కనిపెట్టక పోవడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ భయాందోళనకు గురౌతున్నారు.

You might also like