FbTelugu

బాలికపై వృద్ధుడు అత్యాచారయత్నం

చిత్తూరు: ఓ బాలికపై వృద్ధుడు అత్యాచారానికి యత్నించిన దారుణ ఘటన జిల్లాలోని నాగలాపురం మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక నాగలాపురంలో ఓ 12 బాలికపై ఓ వృద్ధుడు ఎవరూ లేని సమయంలో అత్యాచారానికి యత్నించాడు.

బాలిక కేకలు వేయడంతో స్థానికులు గుర్తించి నిందితున్ని పట్టుకున్నారు. ఈ ఘటనపై నాగలాపురం పోలీస్ స్టేషన్ లో బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం బాలికను స్థానిక సత్యవేడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.