FbTelugu

8 ఆకుల మొక్క ధర అధరహో!

వెల్లింగ్టన్: ఇంటి లోపల పెంచుకునే మొక్కకు రూ.14 లక్షల ధర పలికింది. అది కూడా 8 ఆకుల ఉన్న మొక్కకే కావడం గమనార్హం. ఆన్ లైన్ వేలం పాటలో అక్లాండ్ కు చెందిన వ్యక్తి సొంతం చేసుకున్నాడు.

న్యూజిలాండ్ ఆక్షన్ వెబ్ సైట్ ఫోర్టల్ ట్రేడ్ మి వేదికగా ఒక మొక్కను వేలం పాటకు పెట్టింది. రాయల్ గార్డెన్స్ కు చెందిన ఈ మొక్క థాయ్ లాండ్, మలేషియాలకు చెందినదిగా వెల్లడైంది. రాపిడొ ఫొరా టెట్రా స్పెర్మా జాతికి చెందిన ఈ మొక్క తెలుపు రంగులో చూడముచ్చటగా ఉంది. ఇంటి లోపల పెంచుకునే మొక్కల్లో అత్యధిక ధర పలికిన అరుదైన మొక్క ఇదేనని ట్రేడ్ మి ట్వీట్ చేసింది. వేలం పాట సాగుతుండగానే ఒక లక్ష మంది వీక్షకులు చూశారు. గత ఏడాది ఆరు ఆకుల మొక్కకు వేలం పాట నిర్వహించగా రూ.3,91,000 పలికిందని ట్రేడ్ మి ప్రతినిధి మిల్ల్లీ సిల్వెస్టర్ తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.