FbTelugu

ట్రంప్ కు అరెస్టు వారంట్ జారీ

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు అరెస్టు వారంట్ జారీ అయ్యింది. అయితే అది స్వదేశంలో కాదు. విదేశానికి చెందిన కోర్టు వారంట్ జారీ చేయడం సంచలనంగా మారింది.

ఇరానియన్ జనరల్, మిలీషియా లీడర్ హత్య కేసులో ఇరాక్ కోర్టు గురువారం నాడు డొనాల్డ్ ట్రంప్ పై వారంట్ జారీ చేసింది. బాగ్దాద్ కోర్టు మీడియా కార్యాలయం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. గత ఏడాది జనవరిలో బాగ్దాద్ విమానాశ్రయం వద్ద జరిపిన డ్రోన్ దాడిలో ఇరానియన్ జనరల్ ఖాసీం సొలిమని మరణించారు. ఈ ఘటనపై విచారణ జరిపన బాగ్దాద్ ఇన్వెస్టిగేటివ్ కోర్టు జడ్జీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై అరెస్టు వారంట్ జారీ చేశారు. ఈ నేరం రుజువైతే దోషికి మరణశిక్ష విధించే అవకాశాలు ఉన్నాయి.

పదవి నుంచి వైదొలుగుతున్న సమయంలో ఇలాంటి వారంట్లు జారీ చేయడంపై తమకున్న ఆగ్రహాన్ని, ఆవేశాన్ని చల్లార్చుకోవడానికేనని అంతర్జాతీయ న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.