FbTelugu

తీవ్ర తుఫానుగా మారనున్న వాయుగుండం

హైదరాబాద్: రానున్న 12 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా మారనుందని వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం ప్రస్తుతం పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 450 కిలోమీటర్లు, చెన్నైకి ఆగ్నేయంగా 480 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్టుగా తెలిపింది.

ఈ తుఫాన్ రానున్న 24 గంటల్లో బలపడి తీవ్ర తుఫానుగా మారనున్నట్టు తెలిపింది. తమిళనాడు వద్ద తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. ఈ తుఫాన్ కారణంగా బలమైన గాలులు వీస్తాయని.. మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లవద్దని సూచించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.