FbTelugu

అమూల్ బ్రాండ్ అంబాసిడర్ జగన్: అచ్చెన్నాయుడు

అమరావతి: అమూల్ కు బ్రాండ్ అంబాసిడర్ గా సీఎం జగన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని టీడీపీ అధ్యక్షులు కె.అచ్చన్నాయుడు ఆరోపించారు.
ఏపీ డైయిరీకి చెందిన ఆస్తులను అమూల్ కు కట్టబెట్టడంలోనే కుట్ర బహిర్గతం అయిందన్నారు. గుజరాత్ సంస్థ కోసం సంగం డైరీ రైతులను బలి చేస్తున్నారు. తెలుగు భాష పై, తెలుగువారి డైయిరీపై ముఖ్యమంత్రికి నమ్మకం లేదా?.

ఏపీలో డైయిరీలను చంపేందుకు జగన్ రెడ్డి కుట్ర అమలు చేయాలని చూస్తున్నారు. అమూల్ కు పాలు రాకపోవడంతో కక్షగట్టారు. బాగా నడుస్తున్న వ్యవస్థను విధ్వంసం చేయడం ఏవిధంగా న్యాయం?. అమూల్ కు పాలుపోస్తేనే సంక్షేమ పథకాలంటూ బెదిరింపులు చేస్తున్నారు. టీడీపీ నేతలపై కక్ష సాధింపుల కోసం డెయిరీ రంగాన్నే నిర్వీర్యం చేస్తున్నారని అచ్చాన్నాయుడు విమర్శించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.