FbTelugu

అమృత కథాంశంగా చిత్రం: వర్మ

హైదరాబాద్: వాస్తవ ఘటనలు, సంచలనాలను తెరకెక్కించే దర్శకులు రామ్ గోపాల్ వర్మ తన సమర్పణంలో అమృత కథాంశంగా చిత్రం తీసుకు వస్తున్నారు.

ఫాదర్స్ డే సందర్భంగా మిర్యాలగూడ అమృత, మారుతీరావుల కథను తెరకెక్కిస్తున్నట్లు వర్మ ప్రకటించారు. ఇవాళ ఆయన సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు.

మారుతీరావు కుమార్తె అమృతను పెరుమాళ్ల ప్రణయ్ ప్రేమించి పెళ్లి చేసుకోవడం, దళితుడిని పెళ్లి చేసుకున్నదనే కోపంతో మారుతీరావు సుఫారీ ఇచ్చి హత్య చేయించాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మారుతీరావు ఇటీవల హైదరాబాద్ లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. హత్యా, ఆత్మహత్యా అనేది ఇంకా వెల్లడి కాలేదు.

అయితే వాస్తవ ఘటన ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు వర్మ తెలిపారు. ఫాదర్స్ డే సందర్భంగా పోస్టర్ ను విడుదల చేస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. ఈ చిత్రంలో నట్టి కరుణ, కరుణ క్రాంతి నిర్మాతలు కాగా, ఆనంద్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.

ram gopal varma

You might also like