FbTelugu

అమరావతిలో ఏఎంఆర్డీఏ వచ్చేసింది

అమరావతి: సీఆర్డీఏ స్థానంలో ఏఎంఆర్డీఏ వచ్చేసింది. రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటు నేపథ్యంలో క్యాపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ (సీఆర్డీఏ)ను రద్దు చేసింది.

దీని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవపల్ మెంట్ అథారిటీ (ఏఎంఆర్డీఏ) ను నోటీఫై చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. సీఆర్డీఏ పరిధి అంతా ఇక నుంచి ఏఎంఆర్డీఏ పరిధిలోనికి వస్తుందని పేర్కొన్నారు. ఇక నుంచి సీఆర్డీఏ ఉనికిలో ఉండదని స్పష్టం చేశారు. ఏఎంఆర్డీఏకు పురపాలక శాఖ కార్యదర్శి ఉపాధ్యక్షుడుగా 11 మంది అధికారులు సభ్యులుగా పాలక కమిటీ ఏర్పాటు అయ్యింది. కమిటీలో ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ఏఎంఆర్డీఏ కమిషనర్, గుంటూరు, కృష్ణా జిల్లా కలెక్టర్లు, డైరెక్టర్ టౌన్ ప్లానింగ్ డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్‌లు సభ్యులుగా ఉండనున్నారు. ఈ ఆదేశాలకు అనుబంధంగా మరో ఉత్తర్వును జారీ చేశారు. ఏఎంఆర్డీఏకు కమిషనర్‌గా లక్ష్మీ నరసింహంను నియమించారు.

You might also like