FbTelugu

అమరావతి@491 కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ తీవ్రస్థాయిలో విజృంభన కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 491 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

ఒక రోజుల కరోనా పాజిటివ్ తో ఐదుగురు మృతి చెందగా, ఇప్పటివరకు కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 101. రాష్ట్రానికి సంబంధించిన కరోనా పాజిటివ్ కేసులు 390 కాగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన 101 మందికి కరోనా నిర్ధరణ అయ్యింది.

దీంతో రాష్ట్రంలో మొత్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 8,452 నమోదు కాగా, గడిచిన 24 గంటల్లో మొత్తం 17,609 శాంపిల్స్‌ పరీక్షించారు. కరోనా విస్తరణతో మూడు జిల్లాల్లో పూర్తి స్థాయిలో లాక్ డౌన్ అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతపురం, ప్రకాశం, శ్రీకాకుళంలో పూర్తి స్థాయి లాక్ డౌన్ అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్లు తెలిపారు. మంగళగిరి, తాడేపల్లిలో వంద కేసులు చొప్పున కేసులు నమోదు కావడంతో స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి పూర్తి స్థాయిలో లాక్ డౌన్ అమలు చేయాలని  డిమాండ్ చేశారు.

You might also like