FbTelugu

జస్టిస్ రాకేష్ కు ప్రణమిల్లిన అమరావతి మహిళలు

అమరావతి: సాధారణంగా ఒక న్యాయమూర్తి పదవీ విరమణ చేస్తే హైకోర్టు లో వీడ్కోలు పలుకుతారు. కాని అమరావతి రాజధాని ప్రాంత మహిళలు, రైతులు ఉద్వేగానికి లోనయ్యారు.

గాడ్ ఆఫ్ జస్టిస్, లాంగ్ లీవ్ జస్టిస్ రాకేష్ కుమార్ అంటూ ఆయన వెళ్తున్న దారిలో నినాదాలు చేశారు. పదవీ విరమణ తరువాత ఆయన ఇంటికి వెళ్తున్న సందర్భంలో మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. గత కొద్ది రోజులుగా ఏపీలో వైఎస్.జగన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై తీర్పులు ఇస్తున్నారు. పదవీ విరమణకు ముందు ఒక కేసు నుంచి తప్పుకోవాలంటూ ప్రభుత్వం కౌంటర్ ఫైల్ చేసింది. అమరావతి రైతులకు అనుకూలంగా వ్యవహరించినందుకు ఆయనపై జగన్ ప్రభుత్వం కక్ష కట్టింది.

గురువారం నాడు జస్టిస్ రాకేష్ కుమార్ పదవీ విరమణ చేశారు. హైకోర్టులో పదవీ విరమణ కార్యక్రమం తరువాత ఆయన తన ఇంటికి వెళ్తున్న సమయంలో అమరావతి రైతులు, మహిళలు దారిలో నిల్చున్నారు. వారిని చూసిన జస్టిస్ రాకేష్ కుమార్ తన వాహనాన్ని కొద్ది సేపు ఆపారు. నినాదాలు విన్న ఆయన భావోద్వేగానికి గురయ్యారు. రైతులకు తప్పకుండా న్యాయం జరుగుతుందంటూ ఆయన వెళ్లిపోయారు.

ap capital issue

 

You might also like

Leave A Reply

Your email address will not be published.