FbTelugu

అమరావతి రైతులు సహనం కోల్పోలేదు : లోకేశ్ 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని అమరావతి రైతులు చేపట్టిన ఉద్యమాన్ని ప్రభుత్వం ఎన్ని రకాలుగా ఆపాలని ప్రయత్నించినా రైతులు మాత్రం సహనం కోల్పోలేదని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఏపీలో రైతులు చేపట్టిన జై అమరావతి ఉద్యమానికి నేటితో 150 రోజులకు

చేరుకున్న నేపథ్యంలో లోకేశ్ ట్విట్టర్ వేదికగా పలు వ్యాఖ్యలు చేశారు. ‘జై అమరావతి ఉద్యమంలో నేను సైతం అంటూ భాగస్వామ్యం అయిన రైతులు, మహిళలు, యువత అందరికి ఉద్యమ వందనాలు. భేషజాలకు పోకుండా ప్రభుత్వం ఇప్పటికైనా రాజధానిగా అమరావతిని కొనసాగిస్తున్నాం అని ప్రకటించాలి’ అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు.

You might also like