ఆనందయ్య కు జెడ్ కేటగిరి భద్రత

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆదేశాలు
నెల్లూరు: కరోనా వైరస్ ఆయుర్వేద మందు సృష్టికర్త బొనిగె ఆనందయ్య కు జెడ్ కేటగిరి భద్రత కల్పించాలని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు ఆదేశించారు. ఈ మేరకు కేంద్ర హోం శాఖకు లేఖ రాశారు.

వెంకయ్యనాయుడు కూడా నెల్లూరు జిల్లా వాసి కావడం, ఆయుర్వేద వైద్యంపై పలువురు బాగుందని చెప్పడంతో ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటన్నారు. కేంద్ర ఆయుష్ మంత్రి, ఐసిఎంఆర్ అధికారులతో ఆనందయ్య మందు ను పరిశీలించి అనుమతులు ఇప్పించాల్సిందిగా సూచించారు. అల్లోపతిక్ మెడికల్ మాఫియా నుంచి ఆయన ప్రాణాలకు ముప్పు ఉన్న నేపథ్యంలో జెడ్ కేటగిరీ భద్రత కల్పించాలని వెంకయ్య కేంద్ర హోం శాఖను కోరారు.

నెల్లూరు ఆయుర్వేద మందు పై ఇప్పుడేం మాట్లాడను అని, ఆయుష్ బృందం నివేదిక వచ్చిన తర్వాత మందు పై మాట్లాడుతానని ఆయుష్ డైరెక్టర్ డాక్టర్ వర్షిణి తెలిపారు. కృష్ణపట్నంలో ఆనందయ్య ఆయుర్వేద మందు ఈ రోజు ఇవ్వడం లేదని చెప్పారు. ఐసిఎంఆర్ నివేదిక వచ్చాకే ప్రభుత్వం ఆయుర్వేదం మందు పై ప్రకటన చేస్తుందన్నారు.

Corona virus ayurvedic medicine inventor Bonige Anandayyalatest telugu newsTelugu breaking newstelugu newsZ category security to Anandayya