యువతిపై ఇంత మంది అత్యాచారమా?

రాంచి: అపహరించిన యువతిని మూత పడిన ఆటో గ్యారేజీలో బంధించి, మత్తు ఇంజక్షన్లు ఇచ్చి ఒకరి తరువాత మరొకరు చొప్పున మొత్తం 60 మంది అత్యాచారం చేశారు. ఈ ఘటన సరాయ్ కేలా-ఖర్ సావా జిల్లాలోని కందర్ బేరా సమీపంలో జరిగింది.
ఒక యువతిని కొంత మంది యువకులు అపహరించారు. ఆ తరువాత కందర్ బేరా సమీపంలో ఒక గ్యారేజీలో బంధించారు.

నెల రోజులుగా సుమారు అరవై మంది అత్యాచారం చేశారు. చెప్పినట్లు వినకపోతే శారీరకంగా హింసించారు. మత్తు ఇంజక్షన్లు ఇచ్చి అత్యాచారానికి పాల్పడినట్లు యువతి ఆరోపిస్తున్నది. గురువారం బహిర్భూమికి వెళ్తున్నానని చెప్పి వారి నుంచి తప్పించుకుని నేరుగా పోలీసు స్టేషన్ కు వచ్చింది. తనకు జరిగిన ఘోర అవమానంపై ఫిర్యాదు చేసింది. బాధితురాలు పూర్తి అనారోగ్యంతో ఉందని, మాట్లాడలేకపోతున్నదని పోలీసులు తెలిపారు. ఆరోగ్యం కుదుటపడిన తరువాత వివరాలు వెల్లడించే అవకాశం ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు.

crime newslatest telugu newstelugu brweaking newstelugu news