యువతి కార్డు కొట్టేసి క్యాసినో ఆడారు!

హైదరాబాద్: ఒక యువతి అమాయకత్వాన్ని, మంచితనాన్ని ఆసరా గా చేసుకుని ఆమె ఏటిఎం కార్డు దొంగిలించి లక్షలు కాజేశారు. ఆ సొమ్ముతో గోవా వెళ్లి జల్సాలు చేశారు. క్యాసినో ఆడారు.
తన కార్డు దొంగిలించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తెలిసిన వారే ఇదంతా చేశారని బట్టబయలు అయ్యింది. ఏపిలోని అనంతపురం జిల్లాకు చెందిన పూలకుంట శ్రీనివాస్, కర్నూలు జిల్లాకు చెందిన ఉదయం బతుకు దెరువు కోసం హైదరాబాద్ వచ్చారు. శ్రీనివాస్ తాపి మేస్త్రి కాగా ఉదయ హాస్పిటల్ లో పినిచేస్తాడు. వీరిద్దరికి గణేష్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఒకరోజు గణేష్ తన స్నేహితురాలు అయిన యువతిని పరిచయం చేశాడు. అప్పటి నుంచి అందరూ ఆమె ఇంటికి వెళ్తూ వచ్చేవారు. ఒకరోజు వెళ్లిన సందర్భంగా కుక్క పిల్ల బాగుందంటూ శ్రీనివాస్, ఉదయ్ అనడంతో తీసుకువెళ్లండని చెప్పింది.
ఫిబ్రవరి నెలలో ఆమె ఇంటికి వారిద్దరు వెళ్లగా… ఆమె ఇంట్లో లేదు. కుక్క పిల్లకోసం వచ్చామని, ఆటోలో తీసుకు వెళ్లడానికి డబ్బులు లేవంటూ నమ్మబలికారు. ఇంట్లో ఒక చోట తన ఏటిఎం కార్డు ఉందని, తీసుకువెళ్లి డ్రా చేసుకుని మళ్లీ అక్కడే పెట్టాలంటూ పిన్ నెంబర్ కూడా చెప్పేసింది. ఆ ప్రకారంగానే చేసి తీసుకువచ్చి అక్కడే పెట్టారు.

లక్షల్లో డబ్బులు చూసిన వాళ్లు ఎలాగైనా కొట్టేయాలని ప్లాన్ వేసుకున్నారు. ఎప్పటిలాగే అప్పుడప్పుడు వెళ్లి వస్తున్నారు. ఒకరోజు అదను చూసి ఆమె బ్యాగులో నుంచి ఏటిఎం కార్డు కొట్టేశారు. ఆమె కూడా ఒకరోజు చూడగా లభ్యం కాకపోవడంతో ఎక్కడో ఉంటుందిలే అని మర్చిపోయింది. కార్డులో డబ్బులు డ్రా చేసి గోవాకు వెళ్లి జల్సా చేస్తున్నారు. కార్డు నుంచి రూ.50వేల చొప్పున డ్రా అవుతున్నాయి. ఒకసారి మెస్సేజ్ రావడంతో యువతి అవాక్కయింది. ఈలోపు రూ.3.10 లక్షలు కొల్లగట్టేసి క్యాసినో ఆడారు కూడా. వెంటనే అప్రమత్తమైన యువతి రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేయగా శ్రీనివాస్, ఉదయ్ ల గుట్టు రట్టు అయ్యింది. ఇద్దరిని అరెస్టు చేసి జైలుకు పంపించారు.

crime newslatest telugu newsTelugu breaking newstelugu news