బ్యాంక్ ఉద్యోగినంటూ.. రూ.11 లక్షలకు టోకరా

నల్లగొండ: తాను ఓ బ్యాంకు ఉద్యోగిని అంటూ ఓ యువతి ఫేస్ బుక్ లో ఓ రియల్టర్ కి గాలం వేసి రూ.11 లక్షలు కాజేసిన ఘటన జిల్లాలో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిలల్లాలోని చిట్ట్యాలకు చెందిన నాగిళ్ల లక్ష్మణరావు అనే రియల్టర్ కు ఫేస్ బుక్ ద్వారా లండన్ కు చెందిన ఓ యువతి పరిచయమైంది.

తాను బ్యాంగు ఉద్యోగినంటూ.. ఆ యువతి చాటింగ్ చేసిఆ వ్యక్తి నుంచి రూ.11 లక్షలకు టోకరా వేసింది. చివరకు తాను మోసపోయానని ఎట్టకేలకు గుర్తించిన సదరు వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

cheated case on nalgondacrime newslatest telugu newsTelugu breaking newstelugu news