24 గంటల్లో ఖాళీకి యోగి ఆదేశం

ఘాజీపూర్ రైతు దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్తత
న్యూఢిల్లీ: దేశ రాజధాని సరిహద్దు ఘాజీ పూర్ లో రైతులను 24 గంటల్లో అక్కడి నుంచి తరిమి వేయాలని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలతో యూపీ పోలీసులు, కేంద్ర బలగాలు అక్కడకు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్నది.

సీఎం ఆదేశాలతో ఇవాళ సాయంత్రం ఘాజీపూర్ కు పోలీసులు చేరుకున్నారు. వారు అక్కడి నుంచి కదిలేది లేదని, అవసరమైతే ఉరేసుకుని ఇక్కడే చనిపోతామని హెచ్చరించారు. దీంతో పోలీసులకు, రైతులకు మధ్య తోపులాట జరిగింది. రైతులపై లాఠీలు ఎత్తవద్దని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ కన్నీళ్లు పెట్టుకున్నారు. 24 గంటల్లో ఖాళీ చేయాలని సీఎం యోగి ఆదేశాలు ఇవ్వడం రైతుల్లో ఆందోళన నెలకొంది. ఈ రాత్రికి అందరినీ తరలించేందుకు పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు.

latest telugu newsTelugu breaking newstelugu newsUP Chief Minister Yogi Adityanath