తిరుపతిలో రిగ్గింగ్ కు వైసిపి రెడీ: మాజీ ఎంపి చింతా మోహన్

తిరుపతి: తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం ఉప ఎన్నికల్లో రిగ్గింగ్ కు పాల్పడేందుకు బయటి వ్యక్తులు వచ్చి తిరుపతిని ఆక్రమించారని మాజీ ఎంపి చింతా మోహన్ ఆరోపించారు. రిగ్గింగ్ జరిగితే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని ఆయన హెచ్చరించారు.

మరి కొన్ని గంటల్లో తిరుపతిలో ధర్మ యుద్ధం ప్రారంభమౌతుందని అన్నారు. బయటి నుంచి వ్యక్తులను పంపించకుండా స్థానిక పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఓటర్లు కాని వారిని ఎవరిని కూడా ఇక్కడ ఉండనీయవద్దని ఆయన స్పష్టం చేశఆరు. సిఎం వైఎస్. జగన్ మోహన్ రెడ్డి అధర్మ యుద్ధానికి శ్రీకారం చుట్టారని ఆరోపించారు. ఈ ఎన్నికలు దేశ భవిష్యత్తుకు సంబంధించినవి అని ప్రతి ఒక్కరు ఆలోచించి ఓటు వేయాలన్నారు. తిరుపతిలో రేపు సాయంత్రం 4 నుంచి ఉదయం 7 గంటల మధ్య బందోబస్తు అవసరం అని ఆయన ఎన్నికల కమిషన్ ను కోరారు.

ap ysrcpcm jagan reddyex minister chinta mohanex mp chinta mohanrigging batchtirupathi by elections