వైసిపి ఎంపీ రఘురామ కృష్ణంరాజు అరెస్ట్

హైదరాబాద్: నర్సాపురం వైసిపి ఎంపి కె.రఘురామ కృష్ణంరాజు ను ఏపి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరించారని రఘురామపై అభియోగాలు ఉన్నాయి. ప్రభుత్వంపై ఇటీవల పలు అవినీతి ఆరోపణలు చేశారు. ఏపి సిఐడి డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ సెక్షన్‌ 24 కింద కేసు నమోదు చేసి రఘురామకృష్ణరాజు అరెస్ట్‌ చేసింది. సెక్షన్‌ 50 కింద అరెస్ట్ చేస్తున్నట్లుగా కుటుంబసభ్యులకు నోటీసులు ఇచ్చింది.

రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ ని అడ్డుకునేందుకు సిఆర్పీఎఫ్ సిబ్బంది ప్రయత్నించింది. సిఆర్పీఎఫ్ ఉన్నతాధికారులకు సిఐడి పోలీసులు సమాచారం ఇచ్చి రఘురామ కృష్ణంరాజు ని అదుపులోకి తీసుకున్నారు.  అనంతరం ఆయన్ని మంగళగిరి సిఐడి కార్యాలయానికి తరలించారు.

అకారణంగా మా నాన్నని అరెస్ట్ చేశారు…

ఇవాళ మధ్యాహ్నం 3.30కి 30మంది పోలీసులు వారెంట్ లేకుండా వచ్చి బలవంతంగా లాక్కుని వెళ్లిపోయారని కుమారుడు భరత్ ఆరోపించారు. 4నెలల క్రితం మా నాన్నకు బైపాస్ జరిగింది. ఒక ఎంపీని 30మంది పోలీసులు సిఆర్పీఎఫ్ సిబ్బందిని నెట్టేసి తీసుకుపోయారు. మాకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు, పోలీసుల దగ్గర వారెంట్ లేదు. ఈ రోజు రఘు రామ కృష్ణంరాజు పుట్టిన రోజు అని కుమారుడు భరత్ తెలిపాడు.

ap cid caseAP CM Jaganap disaster caseap latest newsraghurama krishna rajuycp mp raghurama