రెండు గాడిదలకు మతి భ్రమించింది: లేళ్ల అప్పిరెడ్డి

అమరావతి: రాష్ట్రంలో అధికార పక్షం ప్రధాన ప్రతిపక్షంపై అవకాశం దొరికినప్పుడల్లా విరుచుకుపడుతున్నది. తాజాగా వైసీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయుడును గాడిదలతో పోల్చారు.

పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను జీర్ణించుకోలేక మాజీ సీఎం ఎన్.చంద్రబాబు మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. జగన్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి రెండు అడ్డ గాడిదలు బరితెగించి తిరుగుతున్నాయన్నారు. ఒకరు చంద్రబాబు కాగా మరొకరు లోకేష్ అన్నారు. ఈవీఎంలతో మోసం జరిగిందని విష ప్రచారం చేసిన చంద్రబాబు బ్యాలెట్ పేపర్ తో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కూడా ప్రజలు గుణపాఠం చెప్పారని లేళ్ల అప్పిరెడ్డి అన్నారు.

చంద్రబాబు కుమారుడు లోకేష్ నాయుడు విశాఖపట్నంలో మాట్లాడిన మాటలు వింటే ఎవరైనా నవ్వుతారన్నారు. అమెరికాలో చదువుకున్నా సంస్కారం పెరగలేదన్నారు. కులాలు, మతాల పేరుతో నీచ రాజకీయాలు చేస్తున్న తండ్రి, కొడుకు లాంటి రెండు గాడిదల నుంచి ప్రజలను రక్షించేందుకు వైసీపీ ప్రభుత్వం కాపలా కాస్తోందని లేళ్ల అప్పిరెడ్డి అన్నారు.

Chandrababu Naidu and Lokesh Naidulatest telugu newsTelugu breaking newstelugu newsYCP general secretary Lella Appireddy