కన్నబిడ్డలు చూస్తుండగానే మహిళ ఆత్మహత్య

హైదరాబాద్: కన్నబిడ్డలు చూస్తుండగానే ఓ మహిళ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరంలో తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

నగరంలోని లాలాపేటలో మంజుల అనే మహిళ సెల్ఫీ వీడియో తీస్తూ తన ఇద్దరు కన్నబిడ్డలూ చూస్తుండగానే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మంజులకు పన్నెండేళ్ల కిందట పెళ్లయింది. ఆమె భర్త లాలాపేట్ మెయిన్ రోడ్ లో బేకరీ నిర్వహిస్తున్నట్టుగా గుర్తించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. ఘటనపై కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

latest telugu newsTelugu breaking newstelugu news