ఈసిపై మర్డర్ కేసు పెట్టిన టిఎంసి అభ్యర్థి భార్య

కొలకతా: కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసి) పై మర్డర్ కేసు నమోదు చేయాలంటూ టిఎంసి అభ్యర్థి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కార్దా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కాజల్ సిన్హా మృతికి ఈసి కారణమంటూ ఆయన భార్య నందితా సిన్హా ఆరోపించింది.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షాలు పశ్చిమ బెంగాల్ 8 విడతల్లో ఎన్నికలు నిర్వహించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశం మొత్తం కరోనా సెకండ్ వేవ్ తో అల్లాడుతుంటే 8 దశల్లో నెల మొత్తం ఎలా ఎన్నికలు నిర్వహిస్తారని ప్రశ్నించింది. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో మూడు దశల్లో నిర్వహించి, బెంగాల్ లో మాత్రం 8 దశల్లో నిర్వహిస్తారా అని నిలదీసింది. తన భర్త కాజల్ సిన్హా ఈ నెల 25వ తేదీన మృతి చెందాడని, డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ సుదీప్ జైన్ కారణమని ఆరోపించింది. రాష్ట్రంలో పలువురి మృతికి ఈసి బాధ్యతారాహిత్యమని నందితా సిన్హా విమర్శించింది.

latest telugu newsTelugu breaking newstelugu newsTMC candidate Kajal Sinha