ప్రేమ పెళ్లి… ప్రియుడితో కలిసి హత్య

నెల్లూరు: ప్రేమించి పెళ్లి చేసుకుని… మోజు తీరడంతో ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే అంతమొందించింది. కుట్ర గుట్టు రట్టు కావడంతో ప్రియుడితో కలిసి పోలీసులకు పట్టుబడింది.

గూడూరు పోలీసుల కథనం ప్రకారం పట్టణ తూర్పు వీధికి చెందిన రాజేశ్వరమ్మ కుమారుడు రూపేష్ ఎలక్ట్రిషియన్ గా పనిచేస్తున్నాడు. ఏడు సంవత్సరాల క్రితం మానసను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరూ కలిసి నరసయ్యగుంటలో నివాసం ఉంటున్నారు. వీరికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు కలిగారు. కొద్ది నెలలుగా గూడూరు మండలం కొండగుంటకు చెందిన రవివర్మతో సంబంధం పెట్టుకున్నది. ఈ విషయం తెలియడంతో భార్యభర్తల మధ్య గొడవలు జరగడం, మానుకోవాలని భర్త మందలించాడు.

తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన మానస, ప్రియుడి రవి వర్మకు చెప్పింది. గురువారం రాత్రి నిద్రలో ఉన్న రూపేష్ తలపై ఇద్దరు కలిసి ఇనుప రాడ్ తో విచక్షణారహితంగా దాడి చేయడంతో ఊపిరి ఆడక చనిపోయాడు. చనిపోయాడని నిర్థారించుకున్న తరువాత ఇద్దరూ జారుకున్నారు. తల్లి ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేపట్టగా నిజాలు వెలుగు చూశాయి. వీరిద్దరిని తాళమ్మ గుడి ద్వారం వద్ద అదుపులోకి తీసుకుని విచారించగా మొత్తం చెప్పారు.

crime newslatest telugu newsTelugu breaking newstelugu newsWife kills husband