వారు దానిపై స్పందించరెందుకు ?: బండి సంజయ్

హైదరాబాద్: గ్రేటర్ లో టీఆర్ఎస్ నాయకులకు ఓటమి భయం పట్టుకునే అనవసర విమర్శలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన టీఆర్ఎస్ నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు.

వరద సాయం ఆపాలని తాను ఎన్నికల సంఘానికి లేఖ రాయలేదని ముందే చెప్పానని.. దానిపై ఎన్నికల సంఘం కూడా స్పష్టతనిచ్చిందని అన్నారు. వరద సాయాన్ని తానే అడ్డుకున్నానని మొత్తుకున్న నేతలు ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయానికి తాను వెళ్లడంపై టీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారన్నారనీ.. అమ్మవారి ఆలయం పాకిస్థాన్ లో ఉందా ? బాంగ్లాదేశ్ లో ఉందా ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఘోర పరాభవం తప్పదని జోస్యం చెప్పారు.

latest telugu newsTelugu breaking newstelugu news