బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం

హైదరాబాద్: బంగాళాఖాతంలో 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం వ్యాపించి ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు దేశమంతా వ్యాపించాయి. వారికి ఈ ఉపరితల ఆవర్తనం తోడైందని తెలిపింది.

latest telugu newsTelugu breaking newstelugu newsweather infoweather reportsweather updates