వ్యాక్సిన్… వాదన సమర్థించుకుంటున్న యుఎస్

వాషింగ్టన్: వ్యాక్సిన్ ఇవ్వడంలో తాము ప్రథమ ప్రాధాన్యం ఇస్తామని, తమ దేశం తరువాతే ఏ దేశమైనా అని ఆ దేశ విదేశాంగా అధికార ప్రతినిధి నెడ్ ప్రిన్స్ సమర్థించుకున్నారు. తమ దేశ ప్రజల యోగక్షేమాలు చూడడమే ప్రథమ కర్తవ్యమని స్పష్టం చేశారు.
భారత్ లో వ్యాక్సిన్ తయారీకి అసరమైన ముడి పదార్థాల ఎగుమతిపై అమెరికా నిషేధం విధించడాన్ని కరెక్టేనంటోంది. ప్రజలందరికీ వ్యాక్సిన్ చేసేందుకు భారీ లక్ష్యాన్ని పెట్టుకున్నామని, విజయవంతంగా కొనసాగుతుందన్నారు. ఎగుమతులపై నిషేధం విధించడానికి రెండు కారణాలు ఉన్నాయన్నారు. మొదటికి తమ దేశ పౌరులకు వ్యాక్సిన్ ఇవ్వడం. రెండోది అన్ని దేశాల కన్నా మిన్నగా కరోనా బారిన పడడం. అమెరికన్లకు వ్యాక్సిన్ వేయాలన్నది ఆసక్తి తమ దేశ పౌరులదే కాదని, ప్రపంచం కూడా ఇదే విధంగా కోరుకుంటోందని నెడ్ ప్రిన్స్ వ్యాఖ్యానించారు.

వైరస్ ఎక్కడో ఒక చోట ఉన్నంత కాలం అది సరిహద్దులు దాటి విస్తరిస్తునే ఉంటుందని, మ్యుటెంట్ చెందుతూ ఇతర దేశాలకు వ్యాప్తిస్తుందన్నారు. అందుకే తమ పౌరుల బాగోగులకే ప్రాధన్యతమిస్తామని ఆయన వెల్లడించారు. ఇందుకోసమే ప్రస్తుత అధ్యక్షడు జోసెఫ్ ఆర్.బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లు డిఫెన్స్ ప్రొడక్షన్ చట్టాన్ని అమల్లోకి తెచ్చారన్నారు. ఈ చట్టం మూలంగా అమెరికా కంపెనీలు ఏ దేశంలో ఉన్నా మొదట యుఎస్ పౌరుల అవసరాలను తీర్చాల్సి ఉంటుందని అన్నారు. ఈ చట్టంతోనే ముడి పదార్థాల ఎగుమతులపై నిషేధం విధించామని నెడ్ ప్రిన్స్ వెల్లడించారు.

latest telugu newsTelugu breaking newstelugu news