బీజేపీలో చేరిన విజయశాంతి

న్యూఢిల్లీ: గత కొంతకాలంగా కాంగ్రెస్ నేత విజయశాంతి బీజేపీలో చేరుతారంటూ వస్తున్న వార్తలకు ఫుల్ స్టాప్ పడింది. ఇవాళ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ సమక్షంలో విజయశాంతి బీజేపీలో చేరారు.

ఈ సందర్భంగా అరుణ్ సింగ్ బీజేపీ కండువా కప్పి విజయశాంతిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్, భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తదితర ప్రముఖ నేతలు పాల్గొన్నారు.

Telugu breaking newsTelugu latest newstelugu news