వారిపై విశ్వసనీయత అసలే లేదు: విజయసాయి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ నేతలపై ప్రజాదారణ, విశ్వసనీయత లేదని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా.. చంద్రబాబు, లోకేశ్ లపై విమర్శల వర్షం కురిపించారు.

‘‘తండ్రి జూమ్ లో, కొడుకు ట్విట్టర్లో వీరంగాలు వేస్తుంటారు. విష ప్రచార బాధ్యతలు ఎల్లో మీడియా చూసుకుంటోంది. ప్యాకేజీ పార్టీలు కారాలు, మిరియాలు నూరుతుంటాయి. ఎవరికీ ప్రజాదరణ లేదు. విశ్వసనీయత అసలే లేదు. అయినా నిత్యం తాటాకు చప్పుళ్లు చేస్తూనే ఉంటారు.’’ అంటూ ట్వీట్ చేశారు.

latest telugu newsTelugu breaking newstelugu newsvijayasai reddy twittedycp mp vijayasai reddy