కరోనాతో యుపి మంత్రి విజయ్ మృతి

లక్నో: కరోనా పాజిటివ్ తో పోరాడిన యుపి రెవెన్యూ శాఖ మంత్రి విజయ్ కాశ్యప్ (56) చివరకు తనువు చాలించాడు. పాజిటివ్ నిర్థారణ కావడంతో కొద్ది రోజుల క్రితం గుర్గాంవ్ లోని మేదాంత హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.

పరిస్థితి విషమించడం, వైద్యానికి శరీరం సహకరించకపోవడంతో మంగళవారం అర్థరాత్రి ఆయన కన్నుమూశారు. ముజఫర్ నగర్ జిల్లా ఛర్తవాల్ నియోజకవర్గం నుంచి ఆయన బిజెపి అభ్యర్థిగా గెలుపొందారు. యోగి ఆదిత్యానాధ్ దాస్ మంత్రివర్గంలో సభ్యుడిగా చేరారు. యోగి మంత్రి వర్గంలో ఇప్పటికే ఇద్దరు మంత్రులు కరోనా బారిన పడి చికిత్స పొందుతూ చనిపోయారు. వీరే కాకుండా ఐదుగురు ఎమ్మెల్యేలు కన్నుమూయడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం. యుపి చట్టసభలో మొత్తం 403 మంది సభ్యులు ఉండగా 307 సీట్లు బిజెపి గెలుచుకున్నది. మంత్రి మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షులు జెపి.నడ్డా తీవ్ర సంతాపం తెలిపారు.

latest telugu newsTelugu breaking newstelugu newsUP Minister Vijay dies with Corona