2 రోజుల పాటు రూ.19 కే అన్ లిమిటెడ్ కాల్స్

ఢిల్లీ: సెల్యూలార్ మార్కెట్ మరింత పోటీ పెరగడంతో ఖాతాదారులకు దగ్గరయ్యేందుకు ఎయిర్ టెల్ సరికొత్త ప్లాన్ ను తీసుకువచ్చింది. అత్యంత చౌక అయిన రూ.19 ప్లాన్ ను ప్రకటించింది.
ట్రూలీ అన్ లిమిటెడ్ ప్యాకేజీ కింద రూ.19 ప్లాన్ ను తీసుకొచ్చింది. ఈ ప్యాక్ లో అన్ లిమిటెడ్ కాల్స్ సౌకర్యాన్ని కల్పించారు. ఎక్కువగా మాట్లాడేవారికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. దీంతో పాటు 200 ఎంబీ డేటా ను కూడా ఇస్తున్నారు. దీని కాల పరిమితి మాత్రం రెండు రోజులు ఇవ్వగా, ఎలాంటి ఎస్ఎంఎస్ సౌకర్యం కల్పించలేదు.

latest telugu newsTelugu breaking newstelugu news