మండలి ఎన్నికల్లో బీజేపీకి ఊహించనిషాక్

ముంబై: దేశంలోని అనేక రాష్ట్రాల్లో మంచి ఊపు మీద దూసుకెళ్తున్న బీజేపీకి మహారాష్ట్ర శాసన మండలి ఎన్నికల్లో ఊహించని షాక్ తగిలింది. మహారాష్ట్రలో డిసెంబర్ 01న 3 గ్రాడ్యుయేట్‌, 2 ఉపాధ్యాయ, 1 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీట్లకు ఎన్నికలు జరిగాయి.

మొత్తం 6 స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో బీజేపీ కేవలం 1 స్థానంలో మాత్రమే విజయం సాధించింది. ఎన్నికల ఫలితాలు తాజాగా వెలువడ్డాయి. 4 స్థానాల్లో అధికార శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్‌ మహాకూటమి అభ్యర్థుల విజయం సాధించారు. ఇండిపెండెంట్‌ అభ్యర్థి ఒక స్థానాన్ని గెలుచుకున్నారు.

latest telugu newsTelugu breaking newstelugu news