రెండు బస్సులు ఢీ… ముగ్గురు మృతి

విజయనగరం: చెత్త పొగ కారణంగా ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. సుంకరి పేట దగ్గర ఎదురుగా ఎదురుగా వస్తున్న రెండు ఆర్టీసీ బస్ లు ఢీకొన్న ఘటనలో ముగ్గురు వరకు చనిపోయారు.

ఈ ఘటనతో రెండు బసులలో ఉన్న పలువురి ప్రయాణికులకి గాయాలు కావడంతో ఆ ప్రాంతం ఆందోళనకరంగా మారింది. రోడ్డు పక్కన ఉన్న డంపింగ్ ని తగలబెట్టడం వల్ల విపరీతంగా పొగ వ్యాపించడం తో ఈ ప్రమాదం చోటు చేసుకున్నదని స్థానికులు చెబుతున్నారు. తెల్లవారు జామున ఎదురుగా ఎదురుగా వస్తున్న రెండు బస్ లు ఒక్కదానికి ఒక్కటి స్పష్టంగా కనిపించకపోవడం తో ఢీకొన్నాయి. రెండు బసులలో ఇరుక్కుపోయిన ప్రయాణికులను బయటకి తీశారు. స్థానికులు ఫిర్యాదు మేరకు సంఘటన స్థలం వద్దకు అంబులెన్స్ లు, పోలీసులు, ఆర్.టి.సి అధికారులు చేరుకున్నారు. క్షతగాత్రులను విజయనగరం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.

bus accident in vijayanagaramlatest telugu newsTelugu breaking newstelugu newsthree killed bus accidentTwo buses collided in vijayanagaram