హన్మంతుడి జన్మస్థానం ప్రకటించుకోలేదు: టిటిడి ఈఒ

తిరుమల: హనుమంతుడి జన్మస్థలాన్ని ఇప్పటివరకు ఏ రాష్ట్రమూ తమదిగా ప్రకటించుకోలేదని, హంపిని మాత్రం జన్మస్థలంగా చెబుతున్నారని టిటిడి ఈఒ డా. కెఎస్.జవహర్ రెడ్డి తెలిపారు.

హనుమ జన్మస్థానం తిరుమల అంజనాద్రి అని అనడానికి పండితులు ఆధారాలు సేకరించారన్నారు. మావద్ద ఉన్న ఆధారాలను శ్రీరామనవమికి బహిర్గపరుస్తామన్నారు. మంగళవారం జవహర్ రెడ్డి తిరుమలలో మాట్లాడుతూ హనుమంతుడి జన్మస్థలంపై పురాణాలను పరిశీలించి అంజనాద్రి పర్వతమే జన్మస్థలమని బలమైన ఆధారాలతో పండితులు నివేదిక తయారు చేశారని అన్నారు. ఆ నివేదికను వెల్లడించి భక్తులు, ప్రజల అభిప్రాయాలు తీసుకుంటామని ఆయన తెలిపారు. అయోధ్యలో రామజన్మభూమి స్థలంలో ఆలయం నిర్మించుకుంటున్న తరుణంలో హనుమంతుడి జన్మస్థలాన్ని కూడా నిర్ధారించాల్సిన అవసరం ఉందని జవహర్ రెడ్డి అన్నారు.

EO Dr. KS Jawahar Reddylatest telugu newsTelugu breaking newstelugu news