ఫ్లోరిడాలో ట్రంప్ రిసార్ట్ కు ఏమైంది

ఫ్లోరిడా: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్వహిస్తున్న మార్ ఏ లాగో రిసార్ట్ మూతపడింది. ఫ్లోరిడాలోని ఆయన రిసార్ట్ లో పనిచేసే కొంత మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్థారణ కావడంతో మూసివేయక తప్పలేదు.

ఇటీవల మా సిబ్బందిలో కొంత మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వెల్లడైంది. బీచ్ క్లబ్, లా కార్డే డైనింగ్ రూమ్ ను పాక్షికంగా మూసివేశామని క్లబ్ నిర్వాహకులు ట్వీట్ చేసినట్లు యూఎస్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. అయితే ఎంతమందికి సోకిందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. అమెరికా అధ్యక్ష పదవి నుంచి దిగిపోయిన తరువాత ఈ క్లబ్ లోనే డొనాల్డ్ ట్రంప్ నివాసముంటున్నారు. ఆయనతో పాటు ఆయన భార్య, కుమారులు, కుమార్తె ఉంటున్నారు.

Former US President Donald Trumplatest telugu newsMar A Lago ResortTelugu breaking newstelugu newsTrump resort closes in Florida