బలంగా ఢీకొట్టిన లారీలు… ముగ్గురు మృతి

గుంటూరు: దాచేపల్లి మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రెండు లారీలు ఒకదాని వెనుక ఒకటి ఢీకొన్నాయి. ఈ ఘటన గామాలపాడు గ్రామ శివారులో చోటు చేసుకుంది.

ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా..మరో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం క్షతగాత్రులను స్థానికులు గుంటూరు జనరల్ హాస్పిటల్ కు తరలించి చికిత్స చేయిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతులు గామాలపాడుకు చెందిన వెంకటరామయ్య, జానీ బాషాగా పోలీసులు గుర్తించారు.

ap latest newslorries collideLorry accidentTelugu breaking newstruck accident