టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోతుంది: సంజయ్

హైదరాబాద్: రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోతుందని, మధ్యంతర ఎన్నికలు వస్తాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతి అక్రమాల కేసులో సీఎం కేసీఆర్ జైలు కు వెళ్లడం ఖాయమన్నారు.

కార్పొరేట్ ఆసుపత్రులతో కుమ్మక్కయ్యారు కాబట్టే కేసీఆర్ జీనోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్ కు పోకుండా కోవిడ్ వాక్సిన్ ను అడ్డుకునే కుట్ర చేస్తున్నాడని సంజయ్ ఆరోపించారు. సీఎం ఫామ్ హౌస్ కు కూత వేటు దూరంలో ఉన్న భారత్ బయోటెక్ ఇన్ని రోజులు సీఎం ఎందుకు పోలేదని ఆయన నిలదీశారు. నగరంలో వరదలు వచ్చినప్పుడు సీఎం ఫామ్ హౌస్ నుండి బయటకు రాలేదు కానీ, పీఎం మోదీ ఎందుకు రాలేదని టీఆర్ఎస్ వాళ్ళు ప్రశ్నించడం వాళ్ళ దిగుజారుడుతనానికి నిదర్శనమన్నారు.
త్వరలో కోవిడ్ వ్యాక్సిన్ ను తీసుకొద్దామని పీఎం ప్రయత్నం చేస్తుంటే దాని పైన కూడా సీఎం చిల్లర రాజకీయాలు చేస్తున్నాడని సంజయ్ విమర్శించారు. బీజేపీ గెలిస్తే మాత ఘర్షణలు జరుగుతాయని కేసీఆర్ అంటున్నారు. దేశంలో 80 శాతం మున్సిపాలిటీఈలలో అధికారంలో ఉన్నాం, 16 రాష్ట్రాల్లో అధికారం చేపట్టాం, దేశంలో అధికారం లో ఉన్నాం… ఎక్కడ ఘర్షణలు జరిగాయో చెప్పాలని నిలదీశారు. ఓటర్లు బయటకి వస్తే బీజేపీ 100 సీట్లు దాటుతుందని భయంతో ఈ చిల్లర మాటలు మాట్లాడుతున్నారు.

ఎల్.బి.స్టేడియంలో టీఆర్ఎస్ సభకు ఎన్ని డబ్బులు ఇచ్చినా రావట్లేదని బయట జిల్లాల నుండి జనాలను తరలిస్తున్నారు. సీఎం ఈ రోజు టీఆర్ఎస్ సభకు వస్తారో లేదో నమ్మకం లేదన్నారు. సభకు వస్తే 2016 గ్రేటర్ హైదరాబాద్ మెనిఫెస్టోను చదివి ఎం చేసావు, ఏం చెయ్యలేదో చెప్పాలన్నారు. మాజీ ప్రధాని పీవీ, మాజీ సీఎం ఎన్టీఆర్ ఘాట్లను కూలుస్తాము అంటే దారుస్సలాం ను కూలుస్తాము అన్నాను. ఆలా అంటే నా మీద టీఆర్ఎస్ ప్రభుత్వం కేసు పెట్టిందన్నారు. 100 కేసులు పెట్టినా భయపడను, బారాబర్ తెలుగు ప్రజలు, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం మాట మీద నిలబడతానని సంజయ్ స్పష్టం చేశారు.

latest telugu newsTelugu breaking newstelugu news