టీఆర్ఎస్, బీజేపీ భాగోతం బట్టబయలు: ఎంపీ ఉత్తమ్

న్యూఢిల్లీ: టీఆర్ఎస్, బీజేపీ పార్టీ లు ఢిల్లీ మే దోస్తీ, గల్లీ మే కుస్తీ అన్న విషయం మరోసారి బయటపడిందని నల్గొండ ఎంపీ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు చేస్తున్న పోరాటాలకు మద్దతుగా 16 ప్రతిపక్ష పార్టీ లు ఈ రోజు పార్లమెంట్ లో రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాయన్నారు. కానీ టిఆర్ఎస్ సభ్యులు పార్లమెంట్ కు హాజరయ్యి రైతు, వ్యవసాయ వ్యతిరేకతను చాటుకున్నారని ఆయన ఆరోపించారు. ఢిల్లీలో బీజేపీ, టిఆర్ఎస్ పార్టీల చీకటి ఒప్పందం మరోసారి బయటపడిందన్నారు.

నూత‌న వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా కాంగ్రెస్ స‌హా 16 పార్టీలు రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగాన్ని బహిష్కరిస్తే టీఆర్ఎస్ ఎందుకు మౌనంగా ఉందని భువ‌నగిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి నిలదీశారు. దొడ్డిదారిలో కేంద్రం తీసుకువ‌చ్చిన‌ న‌ల్ల‌చ‌ట్టాల‌కు టీఆర్ఎస్ మ‌ద్ద‌తు ఇస్తుందన్నారు. కేంద్రంతో జ‌రిగిన ర‌హ‌స్య ఒప్పందంలో భాగంగా రైతుల‌కు తీరని అన్యాయం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. దేశంలో మొద‌ట‌గా తెలంగాణ‌లోనే నూత‌న చ‌ట్టాల అమ‌లు చేస్తున్నారని మండిపడ్డారు. మ‌ద్ద‌తు ధ‌ర ఇవ్వ‌కుండా రైతుల నోట్లో మ‌ట్టి కొట్టే విధంగా నూత‌న చ‌ట్టాలు ఉన్నాయన్నారు. రైతులారా ఇక‌నైనా మేలుకోండి… టీఆర్ఎస్ నేత‌ల‌ను త‌రిమికొట్టే రోజులు ద‌గ్గర‌ప‌డ్డాయని వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు.

bjp freindshipcm kcrmp uttam reddymp venkat reddyTelugu latest newstrs friendship partyTRS party