ఆ హీరోయిన్ ఇంట్లో విషాదం

బెంగళూరు: టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డే విషాదంలో మునిగిపోయింది. పూజా బామ్మ చనిపోవడంతో కుటుంబ సభ్యులు దుఖఃసాగరంలో ఉన్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్ చేసింది.

క్యూటీని మేము కోల్పోయాం.. ఎక్కడ ఉన్నా సంతోషంగా హాయిగా, ఎలాంటి బాధలు లేకుండా ఉంటుందని ఆశిస్తున్నాను. కష్టాలలో ఉన్నా నవ్వుతునే ఉండాలని బామ్మ నేర్పించిందని పూజ ట్వీట్ చేసింది. ఎల్లప్పుడు ధైర్యంగా ఉండడం, కుటుంబ సభ్యులు, స్నేహితుల కోసం ఈగోలను పక్కన పెట్టాలని తమకు నేర్పించింది బామ్మ. నీ ఆత్మకు శాంతి చేకూర్చాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను అని పూజా పేర్కొంది.

latest telugu newsTelugu breaking newstelugu newsTollywood heroine Pooja Hegde