లాలూకు ఒక న్యాయం, జగన్ కు మరో న్యాయం?

తిరుపతి కాంగ్రెస్ అభ్యర్థి చింతా మోహన్
తిరుపతి: బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ విషయంలో ఒక రకంగా, ఏపీ సిఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి విషయంలో మరో రకంగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వ్వవహరిస్తోందని తిరుపతి కాంగ్రెస్ అభ్యర్థి చింతా మోహన్ సంచలన ఆరోపణలు చేశారు.
తిరుపతిలో చింతా మోహన్ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ, దాణా కేసులో జైలు శిక్షను అనుభవిస్తున్న లాలూకు బెయిల్ రాకుండా బిజెపి అడ్డుకుంటున్నదని అన్నారు.

ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో ఆయన విచారణను ఎదుర్కొంటున్నారన్నారు. అదే అభియోగం ఉన్న సిఎం జగన్మోహన్ రెడ్డి బయట ఎలా తిరుగుతున్నారని చింతా మోహన్ ప్రశ్నించారు. వైసిపి, బిజెపి ఒకే నాణేనికి ఉన్న రెండు పార్శ్వాలు అని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ మాత్రమే రాష్ట్రానికి న్యాయం చేస్తుందని ఆయన తెలిపారు. జగన్ సిఎం గా ఉంటే త్వరలోనే తిరుమల ఆర్ఎస్ఎస్ చేతుల్లోకి వెళ్తుందని ఆయన సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

telugu braking newsTelugu latest newstelugu newsTirupati Congress candidate Chinta Mohan