పవన్ తో తిరుపతి బీజేపీ అభ్యర్థి భేటీ

హైదరాబాద్: తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక బీజేపీ- జనసేన ఉమ్మడి అభ్యర్థి కె.రత్నప్రభ జనసేన అధ్యక్షులు కొణిదెల పవన్ కల్యాణ్ ను హైదరాబాద్ లో కలిశారు. తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రచారానికి రావాల్సిందిగా ఆమె పవన్ ను కోరారు. రెండు పార్టీల సమన్వయంతో ప్రచార కార్యక్రమం రూపొందించాలని నిర్ణయించారు.

ఈ సమావేశంలో జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి డి.పురందేశ్వరి, బిజెపి ఏపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల కో ఇన్చార్జి సునీల్ దేవధర్, రాష్ట్ర జనరల్ సెక్రెటరీ మధుకర్ పాల్గొన్నారు.

Janasena president Konidela Pawan Kalyanlatest telugu newsTelugu breaking newstelugu newsTirupati BJP candidate meets Pawan