మరో ముగ్గురు ఉగ్రవాదులు హతం

జమ్ము కశ్మీర్: ఇవాళ కశ్మీర్ లోని అనంత్‌నాగ్ కుల్చోహార్ వద్ద భారత బలగాలు ఉగ్రవాదులపై జరిపిన ఎన్‌కౌంటర్ లో మరో ముగ్గురు హతమయ్యారు. ఉగ్రవాదులు ఉన్నారన్న ముందస్తు సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న బలగాలు ఉగ్రవాదులపై ఆపరేషన్ నిర్వహించాయి.

ఈ ఎన్ కౌంటర్ లో గంటలోపే ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. గత కొన్ని రోజులుగా భద్రతా బలగాలు వరుసగా ఉగ్రవాదులపై విరుచుకు పడుతున్నాయి. ఈ ఏడాదిలో 6 నెలల వ్యవధిలోనే 116 మంది ఉగ్రవాదులను భారత బలగాలు మట్టుబెట్టాయి.

crime newsjummu kashmir border newslatest telugu newsTelugu breaking newstelugu newsterroists killed