ముగ్గురు మావోయిస్టులు హతం

పాట్నా: కమాండోలు జరిపిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు హతమైన ఘటన బీహార్ లోని గయా జిల్లా, మాహురిలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే..

స్థానిక మాహురి ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారన్న ముందస్తు సమాచారంతో కోబ్రా కమాండోలు అక్కడికి చేరుకొని మావోయిస్టులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు హతమైనారు. మావోయిస్టుల నుంచి ఏకే 47రైఫిల్, ఇన్నాస్ రైఫిల్ ను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం బారాఛట్టీలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

latest telugu newsTelugu breaking newstelugu news