ఆ రాష్ట్రాల వాళ్లు రిపోర్టుతో రావాల్సిందే…

ముంబై: మహారాష్ట్రలో ప్రవేశించే నాలుగు రాష్ట్రాల వారు తమ వెంట కరోనా నెగెటివ్ రిపోర్టు తెచ్చుకోవాలని, చేరుకునే ప్రాంతానికి 72 గంటల ముందు రిపోర్టు తీసుకోవాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
విమానం, రైళ్ల ద్వారా వచ్చేవారు ఈ నిబంధనలు పాటించాల్సిందేనని మహారాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

మహారాష్ట్రలో వారం పది రోజులుగా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. వైరస్ విజృంభణపై సీఎం ఉద్ధవ్ థాక్రే ప్రజలనుద్దేశించి మాట్లాడారు. మాస్క్ లేకుండా బయటకు రావద్దని, దగ్గరదగ్గరా నిల్చొని ఉండవద్దని, శానిటైజ్ చేసుకోవాలని పిలుపునిచ్చారు.

latest telugu newsTelugu breaking newstelugu news