కానిస్టేబుల్ ను ఢీకొన్న ట్రాక్టర్

జోగులాంబ గద్వాల : బైక్ పై వెళుతున్న కానిస్టేబుల్ ను వేగంగా వచ్చిన ఓ ట్రాక్టర్ బలంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన జిల్లాలోని ఇటిక్యాల మండలం ఎర్రవల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్‌గౌడ్‌ అనే వ్యక్తి రాజోలి పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

కాగా విధినిర్వహనలో బాగంగా మోటార్‌ సైకిల్‌ పై వెళుతున్నాడు. ఈ క్రమంలో స్థానిక ఎర్రవల్లిలో వేగంగా వచ్చిన ఓ ట్రాక్టర్ బైకును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో శంకర్ గౌడ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

breaking news in telugucrimegadvalalatest news in teluguroad accidentTelugu breaking newsTelugu latest newstoday latest newstoday news in telugu