టెన్త్, ఇంటర్ పరీక్షలపై పునరాలోచన చేయలి: హైకోర్టు

అమరావతి: టెన్త్, ఇంటర్ పరీక్షలపై ప్రభుత్వం పునఃపరిశీలన చేసుకోవాలని, పిటిషనర్ల తరపున సీనియర్ కౌన్సిల్ చేసిన వాదనలో చాలా అంశాలు ముడిపడి ఉన్నాయని ఏపి హైకోర్టు వ్యాఖ్యానించింది.

ఇంటర్, టెన్త్ పరీక్షలపై ఏపీ హైకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. దాదాపు 30 లక్షల మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్లు పరీక్షల్లో భాగం కావాల్సి ఉందని తెలిపింది.  అందువల్ల ప్రభుత్వం వెంటనే పునపరిశీలన చేసుకోవాలని సూచించింది. మే 3వ తేదీకి కేసు విచారణ వాయిదా వేస్తున్నాం, అదే రోజు ప్రభుత్వ అభిప్రాయం చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. కరోనా పాజిటివ్ వచ్చిన విద్యార్థులు పరీక్షలు ఎలా రాస్తారు?. నిబంధనల ప్రకారం హోం ఐసోలేషన్ లో ఉండాలి కదా? అని ప్రశ్నించింది. వారికి ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వ న్యాయవాది తెలపగా, అదెలా సాధ్యం అవుతుందని హైకోర్టు ప్రశ్నించింది. కరోనా వచ్చిన వారు మానసికంగా పరీక్ష రాయగలుగుతారా?. ఇతర రాష్ట్రాల్లో పరీక్షలు వాయిదా లేదా రద్దు చేసిన విషయంతో పాటు.. రాష్ట్రంలో కేసులు పెరుగుతున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోండని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది.

ap examinstion boardap high courtAP Inter BoardAP Inter Examsminister adimulapu sureshssc exams