భూముల విలువ పెంచిన తెలంగాణ

హైదరాబాద్: ఖర్చులు పెరిగి ఆదాయం తగ్గడంతో తెలంగాణ ప్రభుత్వం స్థిరాస్తి విలువలు పెంచక తప్పలేదు. పెంచిన భూముల విలువలు ఈ నెల 22వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని మంగళవారం నాడు రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
వ్యవసాయ భూములపై కనిష్టంగా 20 శాతం నుంచి 50 శాతం వరకు పెంపుదల చేశారు. ఎకరా భూమి కనిష్టంగా రూ.75వేలు పెంచింది.

బహిరంగ ప్లాట్ (స్థలం) ధర ఒక గజానికి రూ.200 మేర పెంచారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు 6 శాతం నుంచి 7.5 శాతం పెంచుతూ మార్గదర్శకాలు జారీ చేశారు. విలువల పెంపుదల మూలంగా రాష్ట్రంలో పలు ప్రాంతాలలో భూముల విలువ అమాంతం పెరిగే ప్రమాదం ఉంది.

latest telugu newsTelugu breaking newstelugu news