తెలంగాణ కేసుల లెక్క 1,436

లాక్ డౌన్ తో తగ్గుతున్న పాజిటివ్ కేసులు

హైదరాబాద్: లాక్ డౌన్ అమలు చేయడంతో గత రెండు వారాలుగా తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 97.751 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,436 మందికి పాజిటివ్ నిర్థారణ అయ్యింది.

ఇప్పటి వరకు పాజిటివ్ కేసుల సంఖ్య 5,91,170 కు చేరు కోగా నిన్న ఒక్కరోజే 3,614 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. తాజాగా 14 మంది పాజిటివ్ చనిపోగా మొత్తం చనిపోయిన వారు 3,378 మంది. రాష్ట్రంలో ప్రస్తుతం 27,016 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

corona second wavecovid second wavelockdown imposelockdown resultpragathi bhavanTelangana Health Bulletintelangana health department